TG: రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడనుందని, దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.