ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్