అలర్ట్.. ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి కారణంగా స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడం, పనితీరు నెమ్మదించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఓవర్‌హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడం, బ్యాటరీ దెబ్బతినడం వంటివి జరుగుతాయి. వీటిని నివారించడానికి, ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కవర్ తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవచ్చని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్