ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. కాగా మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధార‌ణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా న‌మోద‌వుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕