SBI ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయించుకుని, ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే యోనో యాప్ బ్లాక్ అవుతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి నకిలీ సందేశాలను నమ్మవద్దని కేంద్రం (పీఐబీ ఫ్యాక్ట్‌చెక్) ప్రజలకు సూచించింది. ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని, వ్యక్తిగత, బ్యాంకింగ్, ఆధార్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అనుమానాస్పద సందేశాలను pishing@sbi.co.inకు రిపోర్ట్ చేయాలని కోరింది.