అక్టోబర్ 30వ తేదీన తెలంగాణలో అన్ని కాలేజీలు బంద్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. గత ఆరేళ్లుగా రూ. 8 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని SFI నాయకులు విమర్శించారు. నవంబర్ మొదటి వారంలోగా బకాయిలు విడుదల చేయకపోతే 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్