TG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బంధు అంటూ కొనియాడారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాలు అంత కాంగ్రెస్ వైపే ఉండాలని మల్లు రవి పిలుపునిచ్చారు.