AP : రాష్ట్ర ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఏపీ విభజన హామీల గురించి మాణికం ఠాగూర్ గళం విప్పినా, ఒక్క ఎంపీ కూడా మద్దతుగా నిలబడకపోవడం తెలుగుగడ్డ చేసుకున్న దౌర్భాగ్యమని షర్మిల మండిపడ్డారు. విభజన హామీల విలువ 5 లక్షల కోట్లు అయినా, వాటిని ఎంక్యాష్ చేసుకోలేకపోతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.