గత మూడు రోజులు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.91,400కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.710 పెరిగి రూ.99,710 పలుకుతోంది. 3 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,530 పెరిగింది. వెండి ధర రికార్డు సృష్టించింది. కేజీ వెండిపై ఏకంగా రూ.4,000 పెరిగి రూ.1,25,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.