హీరో అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రుహానీ శర్మ, నిహారిక ఎన్ఎం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.