రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని సర్వే నంబరు 613లో ఉన్న 373.22 ఎకరాల భూమిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ సంస్థ తరఫు న్యాయవాది డి.మాధవరావు పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీహర్షరెడ్డికి ఈ సంస్థతో సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలు ఆధారరహితమన్నారు. ఆయన 2021 డిసెంబరు నుంచి 2023 జనవరి వరకు అదనపు డైరెక్టర్‌గా కొనసాగి, తర్వాత రాజీనామా చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే ఆయనను వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. ఈ స్థలం రాజా శివ్‌రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేటు ఆస్తి అని, 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో యాజమాన్య హక్కులను స్పష్టంగా ధ్రువీకరించినట్టు వెల్లడించారు.