ఏపీలో కూటమి తెలంగాణలోనూ కొనసాగనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ సమయంలో జరిగిన చర్చల్లో తెలంగాణలోనూ కూటమి విస్తరణ పైన చంద్రబాబు, పవన్ తో అమిత్ షా చర్చ చేసారు. ఇందుకు సానుకూలత కనిపించింది. అయితే తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో కూటమిగా వెళ్లాలని టీడీపీ-బీజేపీ- జనసేన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.