ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే AA23 ప్రాజెక్టుతో ట్రెండింగ్‌లో ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా థీమ్ మ్యూజిక్ విడుదలైన 13 రోజుల్లోనే ఇన్‌స్టా రీల్స్‌లో మూడున్నర లక్షలకు పైగా క్రియేట్ అయి రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో లోకేష్ అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారనే ఆసక్తి నెలకొంది.