ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కెరీర్ ఆరంభం నాటి క్లాసిక్, స్టైలిష్ లుక్‌తో కూడిన ఒక వింటేజ్ పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 90ల నాటి సినిమా స్టిల్లా అన్నట్లుగా ఉన్న ఈ క్రేజీ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఒత్తుగా ఉన్న కర్లీ హెయిర్, షార్ప్ లుక్, బ్లాక్ టీ-షర్ట్‌తో సరికొత్త స్టైలిష్ వైబ్స్‌లో ఆకట్టుకుంటున్నారు.