భారత్-శ్రీలంక 'ఎ' జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు గురువారం గాలేలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ 'ఎ' జట్టు, బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 'ఎ'ను 25 ఓవర్లలో 87/2 వద్ద కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో విదర్భ స్టార్ అమన్ మోఖడే భారత్ 'ఎ' తరఫున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అమన్, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసి, గ్రేమ్ పొలాక్ ప్రపంచ రికార్డును సమం చేశాడు.