అమరావతిని దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్‌ల రాజధాని అని ఆయన ఆరోపించారు. ఇక్కడ ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతోందని, 2018లో చేపట్టిన పనులనే 2024 తర్వాత కూడా అవే కంపెనీలకు అప్పగించారని ఆయన విమర్శించారు. ఫైవ్‌స్టార్ నిర్మాణాల్లో కూడా చదరపు అడుగుకు రూ.4,500 మించదని ఆయన అన్నారు.