ఓ ప్రయాణికుడు విమానం నుంచే నాసా ఆర్టెమిస్-2 రాకెట్ దూసుకెళ్తున్న అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. మేఘాల పైనుంచి రాకెట్ నింగిలోకి ప్రయాణిస్తున్న ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బందించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అంతరిక్ష ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటూ సరికొత్త అనుభూతిని పంచుతోంది.