ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 'ప్రైమ్ డే 2026' సేల్‌ను జులై 4 నుంచి 6 వరకు నిర్వహించనుంది. ఈ మూడు రోజుల మెగా షాపింగ్ ఈవెంట్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 10వ వార్షికోత్సవం సందర్భంగా 300కుపైగా బ్రాండ్‌ల నుంచి 15,000కు పైగా ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, 500కుపైగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉంటాయి. ఐఫోన్ 17 సిరీస్, వన్‌ప్లస్ నార్డ్ 6, రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ, ఐకూ 15ఆర్ వంటి మోడళ్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.