ఆరోగ్యకరమైన ఆహారంపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో, మల్టీగ్రెయిన్ అంబలి ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం, రాగులు, జొన్నలు, ఫూల్ మఖానా, బాదం పప్పు వంటి నాలుగు ప్రధాన పదార్థాలతో ఈ అంబలిని తయారు చేస్తారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. పోషకాల లోపాలు దూరమవుతాయి. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడంతో పాటు పలు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.