విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థుల కోసం ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్సీ సంక్షేమ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బుధవారం నుంచి ఆగస్టు 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం 500 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం రెండు వాయిదాల్లో అందిస్తుంది.