ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ దిగ్గజం ఏంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఒప్పోతో ఒప్పందం కుదుర్చుకుని స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి ప్రవేశించనుంది. ఈ ఒప్పందం ద్వారా ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి చైనా బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓ జస్బీర్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. తొలి ఏడాదిలో 80 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.