అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మృతి

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి చేరిన గర్భిణీ పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించి 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ఆ తర్వాత గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.

సంబంధిత పోస్ట్