గుజరాత్లోని లోధికా తాలూకా మోటావాడ గ్రామంలో రోడ్డు సరిగా లేక 108 అంబులెన్స్ మధ్యలోనే నిలిచిపోయింది. అప్పటికే పురిటినొప్పులతో ఉన్న మహిళ ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన 108 సిబ్బంది వైద్య పరికరాలతో కాలినడకన ఇంటికి చేరుకుని తల్లీబిడ్డకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఎడ్లబండిపై అంబులెన్స్ వరకు తీసుకొచ్చి లోధికా CHCకి తరలించారు.