పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడికి దిగింది. బందర్ అబ్బాస్‌లోని సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలో నాలుగు ఇరాన్ అటాక్ డ్రోన్లను అమెరికా కూల్చివేసింది. దీనికి ప్రతిస్పందనగా కువైట్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ ప్రతీకార దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ ప్రాంతంలో మరింత అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది.