అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, హండాలా టీమ్ అనే హ్యాకర్ల బృందం ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ-మెయిల్ ను హ్యాక్ చేసినట్లు ప్రకటించింది. పటేల్‌కు చెందిన ఫోటోలు, దస్త్రాలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ సైబర్ నేరగాళ్లకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అమెరికా న్యాయశాఖ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.