వెనెజువెలా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి చమురును అమెరికా స్వాధీనం చేసుకుందని ట్రంప్ వర్గాలు ప్రచారం చేస్తున్నా, వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం అమెరికా ఆధిపత్యాన్ని తిరస్కరిస్తోంది. ఇదే సమయంలో భారత్–వెనెజువెలా మధ్య చమురు కొనుగోలు సహా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రకారం, రష్యా బదులు వెనెజువెలా చమురు దిగుమతులు పెంచితే భారత్‌కు ఏటా 3 బిలియన్ డాలర్ల ఆదా అవుతోంది. రవాణా ఖర్చులు ఎక్కువైనా, మల్టీ సోర్సింగ్ వ్యూహంతో దీర్ఘకాల లాభం ఉంటుందని నివేదిక పేర్కొంది.