అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశ మ్యూజియంలో ఉన్న భారత్‌కు చెందిన పురాతన కాంస్య విగ్రహాలను తిరిగి స్వదేశానికి ఇవ్వడానికి అంగీకరించింది. వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యుజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్‌లో కీ.శ 990 నాటి శివనటరాజ విగ్రహాం, 12వ శతాబ్ధపు నాటి సోమస్కంద, 16వ శతాబ్ధానికి చెందిన సుందరర్ అనే సాధువుకు చెంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి తమిళనాడుకు చెందినవని, దొంగతనంగా ఆ మ్యూజియానికి చేరాయని భారత్ వాదించింది. మ్యూజియం అధికారులు అక్రమంగా చేరినట్లు అంగీకరించి, వాటిని తిరిగి భారత్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో భారతీయ శిల్పసంపద తిరిగి దేశానికి వస్తుంది.