ఇరాక్‌లోని చివరి సైనిక స్థావరాల నుంచి అమెరికా బలగాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగనున్నాయి. దీంతో 20 ఏళ్లకు పైగా కొనసాగిన అమెరికా సైనిక ఉనికి ముగియనుంది. ఈ పరిణామాన్ని ఇరాన్, దాని మద్దతు ఉన్న సాయుధ వర్గాలు విజయంగా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు అమెరికా బలగాల నిష్క్రమణతో ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం పెరగడంతో పాటు ఇస్లామిక్ స్టేట్ మళ్లీ బలపడే అవకాశం ఉందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఐఎస్ ఉగ్రవాదులపై పోరులో అమెరికా కీలక పాత్ర పోషించింది.