నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్‌పై చర్చకు సిద్ధమని అమిత్ షా పేర్కొనగా, సభలో అమిత్ షా ఊహాజనిత ఉపన్యాసం వినే ఆసక్తి తమకు లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. విద్యార్థులపై కాల్పులకు ఆదేశించి ఉంటే అమిత్‌షా రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.