సూరత్ విమానాశ్రయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ప్రమాదం తప్పింది. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తీవ్ర తోపులాట, గందరగోళం నెలకొంది. జనాలు అదుపు తప్పడంతో విమానాశ్రయంలోని ఒక గాజు డోర్ విరిగిపోయింది. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఉద్రిక్తత మధ్య కూడా అమితాబ్ సంయమనంతో అభిమానులకు అభివాదం చేస్తూ సురక్షితంగా తన కారు వద్దకు వెళ్లారు.