ఉసిరి కాయను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చి, కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చుండ్రును నివారించి, కురుల పెరుగుదలకు సహాయపడుతుంది. ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరిని సలాడ్, జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు.