దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు పెంపు

అమూల్ పాల ధరలను 4-5 శాతం పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. నవంబర్ 12 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. అమూల్ తాజా లీటర్‌పై రూ.2, గోల్డ్ లీటర్‌పై రూ.4 పెరగనుంది. పశువుల మేత, దాణా, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమూల్ వెల్లడించింది. పెంపు ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన పాలు అందించనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే మదర్ డెయిరీ ధరలు పెంచింది.

సంబంధిత పోస్ట్

✕
✕