అంతరించిపోయిన ఈ పక్షి ఈక రూ. 23 లక్షలు!

న్యూజిలాండ్‌లో ఇటీవల జరిగిన వేలంలో, అంతరించిపోయిన హుయా పక్షికి చెందిన ఒక ప్రత్యేకమైన ఈక సుమారు రూ. 23 లక్షలకు అమ్ముడైంది. ఈ ఈక బంగారం కంటే ఖరీదైనదిగా నిలిచింది. హుయా పక్షిని మావోరీ ప్రజలు పవిత్రంగా భావిస్తారు. 1907లో చివరిసారిగా కనిపించిన ఈ పక్షికి చెందిన ఈక కలెక్టర్లను ఆకర్షించింది. వేలం గృహం కళా నిపుణురాలు లియా మోరిస్ ప్రకారం, ఈక ముదురు గోధుమ రంగులో మెరిసే లక్షణాలతో పాటు, కీటకాల దాడికి గురికాకుండా, విరిగిపోకుండా సురక్షితంగా ఉండటమే అధిక ధరకు కారణం.

సంబంధిత పోస్ట్