TG: తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు.'లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం' అని తెలిపారు. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా మొదలై, నేడు “రేవంతన్న”గా ప్రజల గుండెల్లో నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేస్తానని సీఎం రేవంత్ రాసుకొచ్చారు.