బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌లోని భుస్రా చౌక్ దగ్గర 65ఏళ్ల వృద్ధుడు మతిస్థితిమితం లేని అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఓ దుకాణం బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. అకస్మాత్తుగా ఈ వీడియో చూసిన దుకాణాదారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా ఈ ఘటన ఓ గల్లీలోని రెండు షాపుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.