కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో పోలీసుల వ్యక్తిగత వివాదం సంచలనం సృష్టించింది. యాద్‌గిర్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్ఐ వీరేష్, లేడీ కానిస్టేబుల్ విజయశ్రీ తనను నమ్మించి మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2017 నుంచి ప్రేమలో ఉన్నామని, నాలుగేళ్లు సహజీవనం చేశామని తెలిపాడు. ఆలయంలో వివాహం కూడా చేసుకున్నామని, ఆమె తన వద్ద నుంచి రూ.35 లక్షలు తీసుకుందని వీరేష్ ఆరోపించారు. ఇప్పుడు కులం పేరు చెప్పి తనను కాదంటోంని వీరేష్ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.