SRH యజమాని కావ్యా మారన్‌కు పోటీగాఆర్సీబీ కూడా తమ 'కావ్యా మారన్' ను పరిచయం చేసింది. ఆమె పేరు అనన్య బిర్లా, బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళ్‌మ్ బిర్లా పెద్ద కుమార్తె. శనివారం జరిగిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు అనన్య బిర్లా, ఆర్యమాన్ బిర్లా హాజరయ్యారు. ఆర్సీబీ జెర్సీ ధరించిన అనన్య, ఆర్సీబీ జెండా ఊపుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆమె హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి అనన్య మ్యాచ్ వీక్షించారు.