యాంకర్ కపిల్ శర్మ కాప్స్ కేఫ్‌పై కాల్పులు (VIDEO)

ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మ ప్రారంభించిన కెనడాలోని కాప్స్ కేఫ్‌పై జూలై 9 రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన భార్య గిన్నితో కలిసి సర్రేలో ప్రారంభించిన ఈ కేఫ్‌పై జరిగిన దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే కేఫ్‌కు సంబంధించిన చాలా వస్తువులు దెబ్బతిన్నాయి. భవనంపై బుల్లెట్ మచ్చలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్