యాంకర్ భూ వివాదం.. ఎస్సైపై హైకోర్టు ఆగ్రహం

TG: యాంకర్ శిల్పా చక్రవర్తి దంపతులకు సంబంధించిన భూ వివాదంలో కలుగజేసుకున్నందుకు నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ భూవివాదంలో ఎస్సై కల్పించుకుని ఇబ్బందులు పెట్టినట్లు వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. దంపతులను స్టేషన్ పిలిపించి బలవంతంగా సెటిల్ చేసేందుకు యత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలంటూ ఎస్సైకి నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్