ఇటీవల సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్పూఫ్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. వాటిపై యాంకర్ రవి స్పందిస్తూ శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. హిందువులను కించపరచలేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే శనివారం మరో వీడియోను రిలీజ్ చేస్తూ.. అది స్కిట్ కాదు.. సినిమా సీన్‌ను ఎనాక్ట్ చేశామన్నారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదన్నారు. దేవుళ్లను, మతాలను మేం ఏమీ అనలేదని.. పొద్దున లేచింది మొదలు భగవంతుడి స్మరణ చేసేవాడినని తెలిపారు.