లాలాపేట్ నుంచి మొదలైన అందెశ్రీ అంతిమయాత్ర

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంతిమ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీనియర్‌ నేత వీహెచ్‌లు అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి, లాలాపేట్‌ నుంచి తార్నాక, ఉప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ వరకు జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘట్‌కేసర్‌లో జరిగే అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్