అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

TG: సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. సనుగుల గ్రామానికి చెందిన జి. పరిమిళ (39) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పరిమళ.. దేవుని తండా గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తనకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవని స్థానికులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్