TG: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో కన్న తండ్రే నోరు మూసి చిన్నారిని హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పోల్కంపేటకు చెందిన అనిల్ తన భార్యపై కోపంతో కుమారుడి ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తీసుకొచ్చాడు.అనిల్‌ను భార్య గట్టిగా నిలదీయడంతో విషయం బయటకొచ్చింది. తానే హత్య చేసినట్లు చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి అక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.