టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనేది ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా టైటిల్ విషయంలో కూడా అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్ కనిపిస్తోంది.