అశ్వారావుపేటలో తెగిన అంకమ్మ చెరువు కట్ట

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంకమ్మ చెరువు కట్ట తెగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి పారుతున్న నీటిలోనే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గడిచిన రెండు రోజుల్లో అశ్వారావుపేటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు 440 మి.మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్

✕
✕