గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ చేశారు. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్‌తో పాటు మరో 199 మందిని బుధవారం ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో, సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్మోల్‌పై దేశవ్యాప్తంగా 20 కేసులున్నాయి. నకిలీ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో అక్రమంగా ప్రవేశించినందుకు అక్కడ అరెస్ట్ అయ్యాడు.