ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (89) ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్తో ఆగస్టు 31న ముంబైలోని బాంబే ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల చికిత్స అనంతరం సెప్టెంబర్ 10న ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. డిశ్చార్జ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను గత 90 ఏళ్లుగా దేశానికి సేవ చేశానని, 100 ఏళ్లు వచ్చే వరకు దేశ సేవ చేస్తూనే ఉంటానని తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.