పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల స్పెషల్ బర్త్‌డే విషెస్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఓ వ్యక్తిగత ఫొటోను షేర్ చేస్తూ హృదయపూర్వకంగా విషెస్ చెప్పారు. ‘‘మీరు ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేశారు’’ అంటూ పవన్‌పై తనకున్న ఆప్యాయతను, ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్