తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాలను తాజాగా ప్రకటించింది. మొత్తం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా, మరో 254 మండలాల్లో మోస్తరు ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు ప్రారంభించాలని సూచించింది.