కర్నూల్‌లో బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి ఓ ఏసీ స్లీపర్ బస్సు 39 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకి దింపడంతో పెను ప్రమాదం తప్పింది.